పటాన్‌చెరు,మే,26,(మెదక్ టుడే) న్యూస్: ప్రతినిధి.అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన మాజీ మంత్రి, అసెంబ్లీ ఉపనేత శ్రీ తన్నీరు హరీష్‌రావును తెలంగాణ మాజీ ప్రోటెం చైర్మన్ శ్రీ వి. భూపాల్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేలా పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది.