MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 12:50 am Digital Edition : SHIVA KUMAR

హనుమాన్ జయంతి వేడుకల్లో విశాల శ్రావణ్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు.

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,ఏప్రిల్,2,మెదక్ టుడే న్యూస్:అచంచలమైన భక్తి, అపారమైన శక్తి, అజేయమైన ధైర్యానికి ప్రతీకగా నిలిచే భగవాన్ శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా కేశంపేట్ మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని 15వ వార్డు ఆంజనేయస్వామి ఆలయంలో విశాల శ్రావణ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ హనుమంతుడిలా ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవాభావం, అపార సహనంతో జీవించాలని సూచించారు. మనిషిలోని భయాలను జయించి సత్యం, ధర్మ మార్గంలో ముందుకు సాగేందుకు హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ భర్త సాదిక్, సీనియర్ నాయకులు జమృద్ ఖాన్, ప్రాంతీయ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.