గుమ్మడిదల మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

గుమ్మడిదల,మే,26,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధినూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం, దోమడుగు, వీరన్న గూడెం, బొంతపల్లి, గుమ్మడిదలలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక పాలకవర్గం సభ్యులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి వార్డులో మౌలిక వసతులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే...