MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 4:34 am Digital Edition : Shiva Kumar

గుమ్మడిదల మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

గుమ్మడిదల,మే,26,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధినూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం, దోమడుగు, వీరన్న గూడెం, బొంతపల్లి, గుమ్మడిదలలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక పాలకవర్గం సభ్యులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి వార్డులో మౌలిక వసతులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని వివిధ పరిశ్రమల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.