MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 3:47 am Digital Edition : SHIVA KUMAR

గ్రీన్ మెడోస్‌లో ఘనంగా వినాయక నవరాత్రులు: అలరించిన మహిళల కోలాటం

గ్రీన్ మెడోస్‌లో ఘనంగా వినాయక నవరాత్రులు: అలరించిన మహిళల కోలాటం

ఇంత పెద్ద కాలనీకి గుడి లేకపోవడం తీవ్ర లోటు: ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి

ఆలయ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి

అమీన్‌పూర్, సెప్టెంబర్ 22:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ, కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు పూజా కార్యక్రమాల అనంతరం కాలనీ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ మహిళలకు ప్రత్యేకంగా కోలాట నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా కోలాటం ఆడారు.ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి, కాలనీ వాసులు మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా కాలనీలో వినాయక నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ సతీమణి ఉమారాణి అందించిన ప్రోత్సాహం, సహకారంతోనే మహిళలకు ఈ కోలాట కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేయగలిగామని పేర్కొన్నారు.మ కాలనీ ప్రధాన సమస్యపై “మా గ్రీన్ మెడోస్ కాలనీ 50 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఎంతో పెద్ద కాలనీ. చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇంత పెద్ద కాలనీ ఉన్నప్పటికీ, కాలనీవాసులకు ఒక్క గుడి కూడా లేకపోవడం మా అందరికీ ఎంతో పెద్ద లోటుగా మారింది. కాలనీ మహిళలు గానీ, కుటుంబాలు గానీ ఏ పండుగ వచ్చినా, పూజలు చేయాలన్నా స్వామివారి దర్శనం కోసం తప్పనిసరిగా వేరే కాలనీలకు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టిలో ఉంచుకొని మా కాలనీపై ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించి తగిన సహకారం అందించాలని కాలనీవాసుల తరఫున కోరుతున్నాం” అని అన్నారు. అనంతరం కాలనీ మహిళలు మాట్లాడుతూ.. గత ఎనిమిది ఇండ్లగా ఇక్కడ నవరాత్రులు జరుపుకుంటున్నామని, ఈ ఏడాది 9వ రోజు స్వామివారి సన్నిధిలో 32 మంది మహిళలు రెండు బృందాలుగా ఏర్పడి కోలాటం వేయడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఉదయం నుంచే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటూ ప్రోత్సహిస్తున్న కాలనీ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డికి, కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన నందారం ఉమారాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో నందారం నరసింహ గౌడ్–ఉమారాణి దంపతులు ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని కాలనీ మహిళలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోగ్రీన్ మెడోస్ కాలనీ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ మన్నే మహేష్, ట్రెజరర్ శ్రీనివాస రాజు, జాయింట్ సెక్రెటరీ మహేందర్ రెడ్డి, కాలనీ వాసులు కృష్ణారెడ్డి, భార్గవ్ చక్రవర్తి, అమలాకర్, కృష్ణ, మధుకర్ రెడ్డి, రాకేష్, సుదర్శన్ రెడ్డి, గంగాధర్, భాను ప్రకాష్, రంగా, గోపాల్ గౌడ్, నాగరాజ్,అసోసియేషన్ సభ్యులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.