గ్రీన్ మెడోస్ కాలనీలో మహిళా శక్తికి నూతన అధ్యాయం.
ఘనంగా ‘గ్రీన్ మెడోస్ మహిళా సంక్షేమ సంఘం’ ఆవిర్భావం అధ్యక్షురాలిగా కే. దీపిక ఎన్నిక అమీన్పూర్, సెప్టెంబర్ 27:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ డివిజన్- 270 పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలో మహిళల ఐక్యత, సంక్షేమం మరియు సమగ్ర కాలనీ అభివృద్ధే ధ్యేయంగా నూతనంగా ‘గ్రీన్ మెడోస్ మహిళా సంక్షేమ సంఘం’ ఏర్పాటైంది. ఆదివారం కాలనీవాసుల సమక్షంలో జరిగిన సమావేశంలో సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కొన్నేళ్లుగా కాలనీలో పలు కార్యక్రమాలు కొద్దిమందికే పరిమితం...