గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేద్దాం:జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు..

•ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి. మెదక్,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్  విజ్ఞప్తి చేశారు.మెదక్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,గ్రామాల్లో గొడవలు, గుంపుల తగాదాలు, ఉద్రిక్తతలకు దారితీసే చర్యలు పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు, పార్టీ చిహ్నాలపై వాదనలు, ప్రేరేపించే వ్యాఖ్యలు చేయరాదని తెలిపారు....