గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో వైన్ షాపులు బంద్ – మూడు విడతల్లో మద్యం నిషేధం..

(స్టేట్ బ్యూరో)డిసెంబర్,9,మెదక్ టుడే న్యూస్:    తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలపై అధికారులు కఠిన నిషేధం విధించారు. పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మొదటి విడత: డిసెంబర్ 9 నుంచి నిషేధం డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత ఎన్నికలకు సంబంధించి,డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచిపోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు తొలి విడత ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలు...