గొప్ప పరిపాలన దక్షుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.
సుల్తాన్పూర్ లో 10 లక్షల రూపాయల సొంత నిధులతో శివాజీ విగ్రహావిష్కరణ. అమీన్ పూర్,మే,29,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాత అయిన చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలనదక్షుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో 10 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం వేలాది మంది ప్రజల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…శివాజీ...