జిహెచ్ఎంసి అధికారుల వివక్ష – రోడ్ల ఆక్రమణలపై వ్యాపారుల ఆగ్రహం.

చట్టం అందరికీ సమానమే కదా? బీరంగూడ-కిష్టారెడ్డిపేట్ మార్గంలో యథేచ్ఛగా ఆక్రమణలు.. అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి? అమీన్‌పూర్,మే,29,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో రోడ్డు ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై వ్యాపారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీరంగూడ మెయిన్ మార్కెట్ నుండి కిష్టారెడ్డిపేట్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన వెలిసిన ఆక్రమణలు, అధికారుల పనితీరుపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.సమస్య ఏమిటంటే:గత 20 రోజుల క్రితం, జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు...