MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 3:42 pm Digital Edition : Shiva Kumar

ఘనంగా అవతరణ వేడుక.

పాపన్నపేట,జూన్,2,(మెదక్ టుడే న్యూస్)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక పాపన్నపేట మండల వ్యాప్తంగా ఘనంగా జరిగింది. మంగళవారం పాపన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ ప్రతాప రెడ్డి,మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విష్ణువర్ధన్,వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో శ్రీనివాస రాజు,ఎమ్మార్వో కార్యాలయం వద్ద తహశీల్దార్ సతీష్ కుమార్ మువ్వన్నెల జెండా ఎగురావేశారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్,భారాస పార్టీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్ జాతీయ పతికావిష్కరణ చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గునిశెట్టి మల్లేశం,పాపన్నపేట,కొత్తపల్లి ఉప సర్పంచులు సద్దాం హుస్సేన్,వాంకిడి రాము,వివిధ పార్టీ నాయకులు..కుమ్మరి జగన్,ఉప్పరి వెంకటేశం,ఆకుల శ్రీనివాస్,గౌస్,దోసని సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు.