MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 2:01 pm Digital Edition : SHIVA KUMAR

ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ.

పాపన్నపేట, ఏప్రిల్ 14, మెదక్ టుడే న్యూస్:మండల కేంద్రం పాపన్నపేటలో మంగళవారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ,జయంతి కార్యక్రమం అట్టహసంగా జరిగింది. గ్రామంలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేపట్టారు.ఈకార్యక్రమానికి మెదక్ మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంత్ రావు హాజరై నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జై భీమ్. జై అంబేద్కర్ నినాదాలతో సంస్థాన్ పాపన్నపేట మారుమోగింది. తహశీల్దార్ కార్యాలయం సమీపన ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,మాజీ ప్రజాప్రతినిధులు గురుమూర్తి గౌడ్,ఆకుల శ్రీనివాస్,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి,అధికార ప్రతినిధి శెట్టి శ్రీకాంత్,సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు నీరుడి వెంకటేశం,సర్పంచులు దండెం సుశీల దుర్గయ్య,శ్రీను,అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు .. దనుబాబు,బాచారం బాబు,ఎర్రోళ్ల రాజు,ప్రశాంత్,నీరుడి ప్రదీప్ కుమార్,హరీష్,కుంటిగారి శివ,రాజు తదితరులు పాల్గొన్నారు .