గీతంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీ.ఎడ్.2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరంభంఎన్.సి.ఇ.టి.లో అర్హత సాధించడం తప్పనిసరి.
పటాన్ చెరు,మే,27,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సమగ్ర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని)ను ప్రవేశపెట్టనుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా బి.ఏ. బి.ఎడ్., బి.ఎస్సీ. బి.ఎడ్. అనే నాలుగేళ్ల డ్యూయల్-మేజర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తుందని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రిచా శర్మ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. భారతదేశ జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 చట్రంలో ఇది భాగమని ఆమె తెలిపారు.ఈ...