గజ్వేల్ ఏసిపి కే.నర్సింలు,మర్కూక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు..

సిద్దిపేట్, మర్కుక్, జులై 20, మెదక్ టుడే న్యూస్ గజ్వేల్ ఏసిపి కే.నర్సింలు,మర్కూక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు.కె.నర్సింలు, ఏసీపీ గజ్వేల్  వార్షిక తనిఖీ నిమిత్తం మర్కూక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ మొత్తం పరిశీలించి, స్టేషన్‌లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, రికార్డులు, కేసు ప్రాపర్టీ, స్టేషన్ ఆవరణలో ఉన్న కేసు సంబంధిత వాహనాలను,పరిశీలించారు.అదేవిధంగా, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో , మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మర్కూక్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న సైబర్...