గడ్డపోతారం మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ..
జిన్నారం, మే 27,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం, లక్ష్మీపతిగూడెం, వావిలాల, గడ్డ పోతారం, అల్లి నగర్, కిస్టాయపల్లి, ఖాజీపల్లి, జిఎంఆర్ కాలనీలలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని...