అమీన్ పూర్,ఫిబ్రవరి,1,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో పి.జె.ఆర్ ఎంక్లేవ్‌లో జరిగిన ఎస్ ఫ్లిక్స్ ఫిల్మ్ అకాడమీ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈవేడుకకు ముఖ్య అతిథులుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ టీమ్ మరియు ఇతర సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.అకాడమీ యజమాని సంతోష్ ఆహ్వానం మేరకు విచ్చేసిన అతిథులను ఆయన శాలువా మరియు బొకేలతో ఘనంగా సన్మానించారు.సంపత్ రుద్ర ,’బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర దర్శకులుచంద్రహాస్, చిత్ర కథానాయకుడు
మేఘనా ముఖర్జీ చిత్ర కథానాయిక,శేఖర్ బాషా,ప్రముఖ ఆర్.జె మరియు బిగ్ బాస్ ఫేమ్,చల్లా భానుకిరణ్,సినీ దర్శకులు,ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సంతోష్ ని అభినందనలతో ముంచెత్తారు.”ఎస్ ఫ్లిక్స్ ఫిల్మ్ అకాడమీని ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే, ఒకే ఏడాదిలో అద్భుతమైన ప్రగతి సాధించడం సంతోష్ గారి పట్టుదలకు నిదర్శనం. పి.జె.ఆర్ ఎంక్లేవ్‌లో ఇంతటి నాణ్యమైన శిక్షణా సంస్థను నెలకొల్పి, డాన్స్ మరియు నటనపై ఆసక్తి ఉన్న యువతకు ఆయన అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో అభినందనీయం. కళాకారులను ప్రోత్సహించడంలో సంతోష్ చూపిస్తున్న చొరవ గొప్పది. భవిష్యత్తులో ఈ అకాడమీ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంతోష్ వ్యక్తిగతంగా మరిన్ని విజయాలు సాధించాలనిమనస్ఫూర్తిగాకోరుకుంటున్నాము..అకాడమీ అధినేత సంతోష్ ప్రసంగంఅతిథుల ప్రసంగం అనంతరం అకాడమీ యజమాని సంతోష్ భావోద్వేగంతో కూడిన కృతజ్ఞతలు తెలిపారు.”ఈ రోజు మా ఎస్ ఫ్లిక్స్ ఫిల్మ్ అకాడమీ మొదటి వసంతంలోకి అడుగుపెట్టడం చాలా గర్వంగా ఉంది. బిజీ షెడ్యూల్‌లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర హీరో చంద్రహాస్ కి, హీరోయిన్ మేఘన కి, దర్శకులు సంపత్ కి, అలాగే నా మిత్రులు శేఖర్ బాషా మరియు భానుకిరణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు.ఈ సక్సెస్ ఒక్క రోజులో వచ్చింది కాదు. మా అకాడమీని నమ్మి తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులకు, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది. కళపై మక్కువ ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక నిచ్చెనలా ఈ అకాడమీ నిలవాలన్నదే నా ఆశయం. భవిష్యత్తులో మా అకాడమీ నుండి మరింత మంది గొప్ప నటులు, డాన్సర్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను సంతోష్.ఈ వేడుకలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేక్ కటింగ్ అనంతరం అతిథులకు మెమెంటోలను అందజేయడంతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో అకాడమీ యాజమాన్యం,విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

