MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 11:30 am Digital Edition : Medak Today

ఎన్ఎస్ఎస్ క్యాంప్ సమాజ సేవకు ఎంతో ఉపయోగం..

•ఎన్ఎస్ఎస్ క్యాంప్ సమాజ సేవకు ఎంతో ఉపయోగం

•అదనపుఎస్పీ మహేందర్

పాపన్నపేట,నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:

ఎన్ఎస్ఎస్ క్యాంప్ సమాజసేవకు ఎంతగానో ఉపయోగపడుతుందని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎన్ఎస్ఎస్ క్యాడేట్ గా 13 శిబిరాల్లో పాల్గొని ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని వెల్లడించారు, ఈ క్యాంప్ ఎన్ఎస్ఎస్ క్యాడెట్లకు ఎన్నో విషయాలను నేర్పుతుందన్నారు, ఎన్ఎస్ఎస్ శిబిరం ద్వారా క్యాడెట్లు సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, ఇందులో భాగంగా మొదటి రోజు ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని ఎన్ఎస్ఎస్ చైర్మన్ నర్సింలు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జూలకంటి శ్రీనివాస్ , కళాశాల స్టూడెంట్ కౌన్సిలర్ ఎస్ .సంతోష్ కుమార్ జువాలజీ లెక్చరర్ బి.ప్రవీణ్ , అధ్యాపక అధ్యాపకేతర బృందం, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.