ఎన్.ఆర్.ఐ ఆనంద్ నగర్ కాలనీలో ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు: నేడు లడ్డూ వేలం, స్వామివారి శోభాయాత్ర అమీన్‌పూర్,సెప్టెంబర్,19,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూర డివిజన్ పరిధిలోని స్థానిక ఎన్.ఆర్.ఐ ఆనంద్ నగర్ కాలనీలో వినాయక చతుర్థి నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలు, అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా ముగిసింది. ఈ అన్నదాన విందులో కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 1000 నుంచి 1200...