ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో ఎన్ఆర్ఇజిఎస్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

గుమ్మడిదల,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ.. నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, రామిరెడ్డిబావి, కానుకుంట గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో అంతర్గత...