ఏడుపాయల అమ్మవారికి ఘనంగా పూజలు.
[video width="1280" height="576" mp4="http://medaktoday.net/wp-content/uploads/2026/07/VID-20260723-WA0213-1.mp4"][/video] మెదక్ టుడే న్యూస్ జులై 23 మెదక్ జిల్లా ప్రతినిధి (పి. దుర్గేష్ గౌడ్ )పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఈరోజు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం, అలంకరణతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.