ఇక్రిసాట్ కాలనీలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం.
రూ. 2.25 లక్షలకు గణేశుడి లడ్డూ కైవసం భక్తిశ్రద్ధలతో దక్కించుకున్న పెద్దింటి శశికళ–మాధవరెడ్డి కుటుంబం అమీన్పూర్, సెప్టెంబర్ 28:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బీరంగూడ డివిజన్ ఇక్రిసాట్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. గత 15 సంవత్సరాలుగా కాలనీవాసులు, ఉత్సవ కమిటీ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల ముగింపు సందర్భంగా కాలనీలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి శోభాయాత్రను కనులపండువగా ప్రారంభించి, గంగమ్మ ఒడికి...