MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 1:03 am Digital Edition : SHIVA KUMAR

దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ సాయి కుమార్ గౌడ్.

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజల తరఫున దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ చెరుకు శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దుబ్బాక ఇన్చార్జిగా మాత్రమే జన్మదిన జరుపుకుంటున్నాడు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. అప్పుడు ఎమ్మెల్యేగా పుట్టిన రోజు జరుపుకోవాలని నా ఆశ నా గ్రామ ప్రజల ఆశ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వడియారం గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్, చేగుంట ఏఎంసీ చైర్మన్ వెంగళరావు, చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, నలిన్ గౌడ్, చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్, దుబ్బాక అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రఫుల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు