దోమడుగులో 79 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన-ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్.
గుమ్మడిదల,మార్చి,25,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.నూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు వార్డులో హెట్రో డ్రగ్స్ పరిశ్రమ సౌజన్యంతో 79 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, రక్షిత మంచినీటి పైపులైన్ల నిర్మాణ పనులకు బుధవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుమ్మడిదల మున్సిపల్ అభివృద్ధి కోసం ఇప్పటికే...