ధాన్యం కొనకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాంఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:నార్సింగి, చేగుంట మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇరవై రోజులుగా రైతులు వేచిచూస్తున్నప్పటికీ.. సరిపడా లారీలు లేకపోవడం, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎంఆర్ఓ, ఏఓలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు.వడదెబ్బల కారణంగా ఇద్దరు రైతులు అస్వస్థతకు గురైన ఘటనలను ప్రస్తావిస్తూ, రైతులు...