దేవాలయ ఇనాం భూముల్లో ప్రైవేట్ స్కూల్ దందా?

దేవాలయ ఇనాం భూముల్లో ప్రైవేట్ స్కూల్ దందా? పాపన్నపేటలో అక్రమంగా విద్యా సంస్థ నిర్వహణపై ఆరోపణలు అధికారుల పర్యవేక్షణ ఏదీ..? అనుమతులు ఉన్నాయా అంటూ ప్రజల ప్రశ్న స్కూల్‌లో అధిక ఫీజుల వసూళ్లపైనా విమర్శలు..సమగ్ర విచారణకు డిమాండ్ పాపన్నపేట,సెప్టెంబర్,5,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేటలో దేవాలయ ఇనాం భూముల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాలయానికి సంబంధించిన ఇనాం భూముల్లో ప్రైవేట్ స్కూల్‌ను ఎలా నిర్వహిస్తున్నారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేవాలయ భూములను ప్రైవేట్ విద్యా సంస్థకు వినియోగించేందుకు నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయా? లేదా అనే...