దత్తత అవగాహన కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్.
(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,ఏప్రిల్,30,మెదక్ టుడే న్యూస్: ఫరూక్‌నగర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం దత్తతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో బన్సీలాల్ హాజరయ్యారు. సీడీపీఓ ఉదయ మేడం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయ, సంధ్యలు చట్టబద్ధ దత్తత ప్రక్రియ, అనధికార దత్తత వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. దత్తత తీసుకునే దంపతులు కనీసం రెండు సంవత్సరాలు కలిసి ఉండాలని, వారి వయస్సు పిల్లల వయస్సుకంటే కనీసం 25 సంవత్సరాలు ఎక్కువగా ఉండాలని తెలిపారు....