దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఖబడ్దార్!

ఎర్రవల్లి ఘటనపై భగ్గుమన్న పటాన్‌చెరు కాంగ్రెస్ శ్రేణులు దేవానందం ఆధ్వర్యంలో ఘాటుగా విలేకరుల సమావేశం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ సీనియర్ నేత దేవానందం డిమాండ్ పటాన్‌చెరు,సెప్టెంబర్,11,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద నిరసన తెలిపిన దళితులపై బీఆర్‌ఎస్ నాయకులు ప్రదర్శించిన కుల వివక్ష, అహంకారపూరిత వైఖరిపై పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దళితులు నడిచిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో కడిగి ‘శుద్ధి’ చేయడం ప్రజాస్వామ్య సమాజంలో అత్యంత హేయమైన చర్య...