దళిత జర్నలిస్ట్‌పై ,మట్టి మాఫియా దారులు దాడి-నిందితులను అరెస్ట్ చేయాలని డిజిటల్ మీడియా అసోసియేషన్,తాసిల్దార్ కు వినతి పత్రం.

మసాయిపేట,చేగుంట,జూన్,24,మెదక్ టుడే న్యూస్:దళిత జర్నలిస్ట్‌పై దాడి ఘటనను నిరసిస్తూ,నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మసాయిపేట మండల డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు  బుధవారం స్థానిక తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,చుంచు మహేందర్ మసాయిపేట మండలం లో డిజిటల్ మీడియా , జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ నెల జూన్ 15న ఆయన స్థానిక ' అక్రమ మట్టి మాఫియా'దందాపై పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించారు.ఈ కథనంతో మా పైనే వార్త రాస్తావా అంటూ. తీవ్ర ఆగ్రహంతో నిందితుడు...