కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు.

-తెలంగాణ భవన్‌లో అవతరణ వేడుకలు -ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు -తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తాం హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, తప్పుడు హామీలు, విష ప్రచారాలతో అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో...