కాలనీ వాసుల కష్టాలు తెలిసే వరకు విశ్రమించను: కేసీఆర్ నగర్ పర్యటనలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట రాజేష్ గౌడ్!
అమీన్‌పూర్,జూన్,10,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట రాజేష్ గౌడ్ విస్తృతంగా పర్యటించారు. కాలనీ వాసులతో నేరుగా సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాలనీ ప్రజలు తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలు, అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్యం మరియు వెలుగునివ్వని వీధి దీపాల గురించి ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను ఓర్పుగా విన్న కాట రాజేష్ గౌడ్...