చిట్కుల్ లో శాస్త్రోక్తంగా శ్రీ సీత రామ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం.

పటాన్ చెరు,మార్చి,25,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ సొంత నిధులతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జిటిఎన్ కాలనీలో నిర్మించిన శ్రీ హనుమ సమేత సీతా రామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా ముగిసింది.గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా, బుధవారం తెల్లవారుజాము నుండే వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9:43 గంటలకు మృగశిర నక్షత్ర యుక్త వృషభ...