చేగుంటలో మెడికల్ షాపుల బంద్ సంపూర్ణం..

చేగుంట,మే,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, అఖిల భారత ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ ) పిలుపు మేరకు అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీలు, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టిన దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ చేగుంట మండల కేంద్రంలో సంపూర్ణంగా విజయవంతమైంది. రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి. రాజు,...