చేగుంటలో ఇండోర్ బ్యాడ్‌మింటన్ స్టేడియం ఏర్పాటుకు స్థల సేకరణ.

చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో ఇండోర్ బ్యాడ్‌మింటన్ స్టేడియం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ చేగుంట బ్యాడ్‌మింటన్ క్లబ్ ప్రతినిధులు ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీకి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.క్రీడాకారుల సౌకర్యార్థం చేగుంటలో ఇండోర్ బ్యాడ్‌మింటన్ స్టేడియం ఏర్పాటుకు తమ పాలకవర్గం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఇక్కడి యువతలో మంచి క్రీడా నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడారు. క్లబ్ సభ్యులు కోరిన విధంగా స్టేడియం...