చేగుంట తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.

చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేగుంట తహసిల్దార్ బాలలక్ష్మి మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం అధికారులందరూ జెండా వందనం సమర్పించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల పునాదులపై సిద్ధించిన స్వరాష్ట్రంలో ప్రజలందరికీ సేవ చేయడం గర్వకారణంగా ఉందన్నారు. అమరవీరుల ఆశయాలకు...