చేగుంట పంచాయతీ కార్యాలయంలో వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు,
తెలంగాణ అభివృద్ధి పథంలో సాగాలి ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ దివంగత వార్డ్ మెంబర్ సాయిబాబాకు పాలకవర్గం శ్రద్ధాంజలి చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరుల త్యాగాల ఫలంగా సిద్ధించిన స్వరాష్ట్ర ప్రజలందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను మనం ఘనంగా జరుపుకుంటున్నామని, భవిష్యత్తులో రాష్ట్రం మరింత...