MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 3:20 am Digital Edition : Shiva Kumar

చేగుంట నూతన తహసిల్దార్ ను సన్మానించిన మండల జర్నలిస్టులు.

చేగుంట నూతన తహసిల్దార్ బాలలక్ష్మి సన్మానించిన మండల జర్నలిస్టులు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవిన్యూ సమస్యలను పరిష్కరిస్తా తహసిల్దార్ బాలలక్ష్మి

చేగుంట,జూన్,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల నూతన తహసిల్దార్ (ఎమ్మార్వో) గా బాధ్యతలు స్వీకరించిన బాలలక్ష్మిని చేగుంట మండల రిపోర్టర్లు (పాత్రికేయులు) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఆమెను కలిసి నూతన విధుల్లో చేరినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విలేకరులందరూ కలిసి నూతన తహసిల్దార్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.తహసిల్దార్ బాలలక్ష్మి దీనికంటే ముందు వెల్దుర్తి మండలంలో ఎమ్మార్వోగా సుదీర్ఘ సేవలు అందించి, బదిలీపై చేగుంట మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.చేగుంట మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకమైన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. మండల ప్రగతిలో మీడియా పాత్ర కూడా కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మండల రిపోర్టర్లు అన్నం మహేష్, సూర్య ప్రకాష్, మొహమ్మద్ ముజామిల్, సతీష్, నడిగొప్ప నాగార్జున, శ్రావణ్ కుమార్, చిక్కుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.