MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 4:22 am Digital Edition : SHIVA KUMAR

చేగుంట మండలంలో చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలన.. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన జెడ్పీ సీఈఓ ఎల్లయ్య.

చేగుంట,నవంబర్,5,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని చందాయిపేట, పెద్ద శివునూరు, చిన్న శివునూరు గ్రామపంచాయతీలో చేయూత పింఛన్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య, ఎంపీడీవో చిన్నారెడ్డి, సూపరింటెండెంట్ రాంమోహన్ పాల్గొని పింఛన్ దరఖాస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. దరఖాస్తుదారుల అర్హతలు, సమర్పించిన పత్రాలు, ఇతర వివరాలను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్లు అందేలా చూస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కృష్ణ, రాజు, శ్రీకాంత్ సర్పంచులు పాల్గొన్నారు.