ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
చేగుంట,మే,28,మెదక్ టుడే న్యూస్:బక్రీద్ పండుగ సందర్భంగా చేగుంట మండల ముస్లిం సోదరులు ఉదయాన్నే మసీదు దగ్గర అందరూ కలుసుకొని ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు.అనంతరం ఒకరికొకరు ఆలాయి బలాయ్ తీసుకొని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అనంతరం మస్జీద్ ఈమమ్ అన్వేర్ ఉల్ హాక్ మాట్లాడుతూ.బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈద్గా దగ్గర బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్టు తెలిపారు.త్యాగం భక్తి విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.ప్రతి సంవత్సరం రంజాన్ పండగ ముగిసిన తర్వాత బక్రీద్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.ఆ అల్లా దీవెనెలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమం లో మస్జీద్ ఈమమ్ అన్వార్ ఉల్ హాక్, మస్జీద్ కమిటీ ఉపాధ్యక్షులు రహీమోద్దీన్, వార్డ్ సభ్యులు అరిఫ్, టీంక సెట్,తదితరులు పాల్గొన్నారు.
