చేగుంట కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా అమావాస్య అన్నప్రసాద వితరణ.

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రమైన చేగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం అమావాస్యను పురస్కరించుకుని నిరుపేదలకు, భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య రోజున అన్నదానం చేయడం వల్ల పూర్వీకులకు గౌరవం దక్కుతుందని, ఆధ్యాత్మిక పుణ్యఫలం లభిస్తుందనే నమ్మకంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాశెట్టి నాగభూషణం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 1:00 గంటల నుండి ప్రారంభమైన ఈ అన్నప్రసాద వితరణలో చేగుంట గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి...