MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 4:45 am Digital Edition : Shiva Kumar

చేగుంట కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా అమావాస్య అన్నప్రసాద వితరణ.

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రమైన చేగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం అమావాస్యను పురస్కరించుకుని నిరుపేదలకు, భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య రోజున అన్నదానం చేయడం వల్ల పూర్వీకులకు గౌరవం దక్కుతుందని, ఆధ్యాత్మిక పుణ్యఫలం లభిస్తుందనే నమ్మకంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాశెట్టి నాగభూషణం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 1:00 గంటల నుండి ప్రారంభమైన ఈ అన్నప్రసాద వితరణలో చేగుంట గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరికీ ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘అన్నదానం మహోదానం’ అనే భావనతో సాగిన ఈ సేవలో చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్, కన్యాకాపరమేశ్వరి ఆలయ అధ్యక్షులు తోడుపునూరి నగేష్, కార్యదర్శి అయిత రఘు రాములు, మెదక్ జిల్లా ఆర్య వైశ్య మహా సభ అయిత పరంజ్యోతి, టి ఆర్ ముత్యాల గౌడ్, బాలేశం సేటు, చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, మన్నెవారి జలల్పూర్ శ్రీ శ్రీ శ్రీ మహాకాళి దేవస్థానం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కావేరి సత్యనారాయణ, అధ్యక్షులు ఎస్ రామారావు, ఏ లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు రాజేశ్వర్, దేవరాజ్ గోశాల మెయింటెనెన్స్, మ్యాకల శ్రీనివాస్,భక్తులు ప్రముఖులు, యువకులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.