చేగుంటను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి: తహసీల్దార్‌కు బీజేపీ నాయకుల వినతి.

చేగుంట,ఏప్రిల్,16,మెదక్ టుడే న్యూస్: చేగుంట మండలం, భౌగోళికంగా,వసతుల పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న చేగుంట మండల కేంద్రాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని బీజేపీ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం చేగుంట తహసీల్దార్ శివప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు దొంతిరెడ్డి ఎల్లారెడ్డి మాట్లాడుతూ, చేగుంటలో రైల్వే స్టేషన్, 44వ జాతీయ రహదారి సౌకర్యంతో పాటు ప్రభుత్వ భూములు, పరిశ్రమలు, విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. చుట్టుపక్కల మండలాలకు మధ్యలో ఉండి నియోజకవర్గ...