చేగుంటలో ఘనంగా మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజు వర్ధంతి:
పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు చేగుంట,మే,7,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రఫీ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లా పాండ్రంగి (జూలై 4, 1897). జన్మించారు. ఆయన గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అగ్గిపిడుగులా పోరాడిన గొప్ప దేశభక్తుడు అల్లూరి అని కొనియాడారు....