•చేగుంట తాసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో *ఇందిరా మహిళా శక్తి చీరాల పంపిణీ
చేగుంట,నవంబర్,23,మెదక్ టుడే న్యూస్:
చేగుంట మండల కేంద్రంలో
తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఆత్మగౌరవంతో ఉండేలా నాణ్యమైన చీరలను అందించేందుకు ఈ శనివారం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, భారీగా కార్యక్రమాన్ని ప్రారంభించింది.మహిళల గౌరవం, శక్తివంతత, వారి సామాజిక స్థాయిని పెంచే దిశగా ఈ రోజు చేగుంట మండలలో చేగుంట ఎమ్మార్వో ఎంపీడీవో ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ అయిత రఘురాములు,చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, కలిసి ఇందిరమ్మ చీరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు, యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, మహిళ నాయకురాలు, మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
