📄 ePaper
Saturday, March 14, 2026
ADS
HomeNewsచేగుంట రిషి మెమోరియల్ స్కూల్ లో స్వపరిపాలన దినోత్సవం.

చేగుంట రిషి మెమోరియల్ స్కూల్ లో స్వపరిపాలన దినోత్సవం.

📰 Generate e-Paper Clip

చేగుంట,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కేంద్రంలోని రిషి మెమోరియల్ స్కూల్లోవిద్యార్థులే ఉపాధ్యాయులుగా ఒక రోజు విధులు నిర్వహించడం జరిగింది.ప్రతిరోజు ఉపాధ్యాయులు విధి నిర్వహణ ఎంత కష్టంగా ఉంటుందో గుర్తించామని ఇకనుండి మేము కూడా మంచి విద్యార్థులుగా ఉంటూ పెద్దల పట్ల ఉపాధ్యాయుల పట్ల గౌరవప్రదంగా నడుచుకుంటామని తెలుపుతూ వారికి నచ్చిన ఉపాధ్యాయులను అనుకరిస్తూ తమదైన శైలిలో బోధన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వారికిచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం పరుచుకున్నట్లు తెలిపారు. అన్ని రంగాలకు కన్నా ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైన ఉన్నత స్థానంగా వర్ణించారు.
ఈ కార్యక్రమంలో రిషి మెమోరియల్ స్కూల్ కరెస్పాండెంట్  ప్రిన్సిపాల్ సత్యనారాయణ చైర్పర్సన్ సుష్మ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments