MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 6:01 am Digital Edition : Medak Today

చేగుంట లో తైబజార్ వేలం.

చేగుంట,మార్చి,28,మెదక్ టుడే న్యూస్:చేగుంట తైబ జార్ వేలం రూ. 24లక్షల0 5 వేల రూపాయలకి చేగుంట గ్రామానికి చింతల భూపాల్, దక్కించుకున్నారు. శనివారం చేగుంట గ్రామం పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ మండల పంచాయతీ అధికారి విజయపాల్, కార్యదర్శి వెంకటేష్, సర్పంచ్ సండ్రగు స్రవంతి, సతీష్, ఉపసర్పంచ్ రఫిక్, పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ తై బజార్ వేలం ప్రక్రియ నిర్వహించారు. గ్రా మానికి చెందిన 8 మంది వ్యక్తులు తైబజార్ వేలం లో పాల్గొనగా చింతాల భూపాల్, రూ.24 లక్షల 05 వేల రూపాయలకు వేలంపాటలో తై బజార్ దక్కించుకున్నారు. 2026 ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి 2027 మార్చి 31 వరకు ఈ తై బజార్ అమల్లో ఉండనున్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో వా ర్డు సభ్యులు గ్రామ పెద్దలు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు