MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 4:29 am Digital Edition : Medak Today

చేగుంట బాలుర ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం.

చేగుంట,మార్చ్,17,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని బాలుర ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థులు డి.ఈ.ఓ.గా ఎల్. కౌశిక్, ఎం.ఈ.ఓ.గా టి విష్ణు హెచ్.ఎం.గా టి.సిద్ధార్థ్ నోడల్ అధికారిగా కుర్ర శాశ్వత్, మౌర్య, మహమ్మద్,రేవంత్ ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి ఉపాధ్యాయులు రాములు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.