MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 1:55 am Digital Edition : Shiva Kumar

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ రాజేంద్రనగర్ డివిజన్ గండిపేట మండల రిపోర్టర్‌గా దాసరి రవికుమార్‌కు అక్రిడిటేషన్ కార్డుషాద్‌నగర్ రీజినల్ కార్యాలయంలో డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు చేతుల మీదుగా అందజేత.

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,జులై ,1,మెదక్ టుడే న్యూస్:క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ డైలీకి రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని గండిపేట మండల రిపోర్టర్‌గా నియమితులైన దాసరి రవికుమార్ బుధవారం షాద్‌నగర్‌లోని రీజినల్ కార్యాలయంలో అక్రిడిటేషన్ కార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా స్టేట్ స్పెషల్ కరస్పాండెంట్ అండ్ స్టేట్ బ్యూరో చీఫ్ డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు చేతుల మీదుగా రవికుమార్‌కు అక్రిడిటేషన్ కార్డును అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, విలేకరి సమాజానికి వారధిగా, ప్రజల సమస్యలకు గొంతుకగా, నిజాయితీతో కూడిన వార్తా రచనకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.అక్రిడిటేషన్ కార్డు అందుకున్న దాసరి రవికుమార్ సంస్థ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిష్పక్షపాత వార్తలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.