బీరంగూడలో రోడ్డు ఆక్రమణల పాచికలు-జెసిపితో విరుచుకుపడ్డ జిహెచ్ఎంసి అధికారులు!
అమీన్ పూర్,మార్చి,25,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని బీరంగూడలో బుధవారం జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, బీరంగూడ ప్రధాన రహదారి నుండి కృష్ణారెడ్డి పేట వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ షాపులు, షెడ్లు మరియు కంటైనర్లను జెసిపి సహాయంతో తొలగించారు. రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు: రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన ఫ్రూట్ షాపులు, కొబ్బరి బోండాల దుకాణాలు, ఇతర చిరు...