బీరంగూడలో అంబరాన్నంటిన బ్రహ్మోత్సవాలు.. వైభవంగా శివపార్వతుల దివ్య కళ్యాణం.

మూడు రోజుల్లో 6 లక్షల మందికి పైగా భక్తుల దర్శనం: ఆలయ ఈవో శశిధర్, చైర్మన్ సుధాకర్ యాదవ్. శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవం.. కన్నుల పండువగా రథోత్సవం విజయవంతం చేసిన అన్ని శాఖలకు, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు అమీన్ పూర్,ఫిబ్రవరి,16,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఆలయ ప్రాంగణంలో శ్రీ శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల...