బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో లక్ష బిల్వర్చన కార్యక్రమం ఘనంగా
అమీన్పూర్,నవంబర్,15,మెదక్ టుడేన్యూస్: ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి నడుమ లక్ష బిల్వర్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్ వేదమంత్రోచ్ఛారణలతో పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రతి సంవత్సరం మోహన్‌రావు కుటుంబ సభ్యులు విశేష భక్తితో లక్ష బిల్వర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఈవో శశిధర్ గుప్త, జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, లక్ష్మీకాంతరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొని ఏర్పాటు చేసిన సేవలను పర్యవేక్షించారు.శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఈ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
